Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • గ్లామర్ పాత్రలే ఇష్టమంటున్న తమన్నా 
  • వెంకటేష్, పూరీ కాంబో సెట్ అయిందట!
  • 'టెంపర్' హిందీ రీమేక్ లో శ్రీదేవి కూతురు 
  • హౌరా బ్రిడ్జ్ విడుదల వాయిదా  

*  కమర్షియల్ సినిమాలంటేనే తనకి ఇష్టమని చెబుతోంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. "కమర్షియల్ చిత్రాలంటే హీరోయిన్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం, నటించడానికి వాటిల్లో ఏముంటుంది? అనుకుంటారు. అయితే, నా దృష్టిలో అలాంటి గ్లామర్ పాత్రలు చేయడమే కష్టం. అందుకే, ఆ తరహా చిత్రాలంటే నాకెప్పుడూ ఇష్టమే, గౌరవమే" అని చెప్పింది తమన్నా.
*  వెంకటేష్, పూరీ జగన్నాథ్ కలయికలో ఓ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ కాంబినేషన్ ఇప్పటికి సెట్ అయిందని అంటున్నారు. పూరీ ప్రస్తుతం తాను చేస్తున్న 'మెహబూబా' చిత్రం పూర్తి కాగానే ఇది మొదలవుతుందట.
*  ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' చిత్రాన్ని కరణ్ జొహార్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. రణవీర్ సింగ్ కథానాయకుడుగా నటించే ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాహ్నవిని ఎంపిక చేశారు.    
*  రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి జంటగా రూపొందిన 'హౌరా బ్రిడ్జ్' చిత్రం విడుదల ఫిబ్రవరి 2కి వాయిదా పడింది. మొదట్లో ప్రకటించిన విధంగా అయితే నిన్న రిపబ్లిక్ డే నాడు ఈ చిత్రం విడుదల కావలసి వుంది. దీనికి రేవన్ దర్శకత్వం వహించాడు.  

More Telugu News