విమానం ఆలస్యం.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేకపోతోన్న చంద్రబాబు

26-01-2018 Fri 11:29
  • నిన్న దావోస్ నుంచి బయల్దేరిన చంద్రబాబు
  • వాతావరణం అనుకూలించకపోవడంతో అబుదాబిలో ఏపీ సీఎం
  • సాయంత్రం 4 గంటలకు అమరావతికి చేరుకోనున్న చంద్రబాబు
దేశ వ్యాప్తంగా 69వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోతున్నారు. నిన్న దావోస్ నుంచి బయల్దేరిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 7 గంటలకు అమరావతి రావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. ప్రస్తుతం ఆయన అబుదాబిలో ఉన్నారు. దీంతో చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.