Ramcharan: చేతిలో కోడి పుంజుని పట్టుకుని రామ్‌చరణ్‌.. 'రంగస్థలం' రిపబ్లిక్‌ డే పోస్టర్‌!

  • జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తోన్న చెర్రీ 
  • అలరిస్తోన్న కొత్త పోస్టర్
  • మార్చి 30న 'రంగస్థలం' విడుదల

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్, దర్శకుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘రంగస్థలం 1985’ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ‘రంగస్థలం రిపబ్లిక్ డే పోస్టర్’ పేరుతో దీనిని ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఎడమ చేతిలో కోడి పుంజుని పట్టుకుని, కుడి చేతితో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ చెర్రీ కనపడుతున్నాడు.

‘రంగస్థలం 1985’ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా నటిస్తోంది. ఇందులో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News