Guntur District: కోటప్పకొండలో శివుడి పక్కనే సిలువ, నెలవంక... మసీదుల్లో శివుడి చిత్రం ఉంచాలంటూ పెను దుమారం!

  • గుంటూరు జిల్లా కోటప్పకొండలో ఉద్రిక్తత
  • కోండపై ఏర్పాటైన ప్రతిమ
  • తీవ్రంగా మండిపడిన శివస్వామి

కోటప్పకొండలో ఏర్పాటు చేసిన ఓ శివుడి ప్రతిమ పక్కనే సిలువను, నెలవంకను ఏర్పాటు చేయడం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. ఓ వైపు క్రైస్తవ చిహ్నాన్ని, మరోవైపు ముస్లిం చిహ్నాన్నీ ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పలువురు ఆందోళనకు దిగారు. ఈ విషయమై శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ, ఏదైనా మసీదులో, చర్చ్ లో శివుడి చిత్రపటాన్ని లేదా మరే హిందూ దేవుడి విగ్రహాన్నైనా ఉంచగలరా? అని ప్రశ్నించారు.

 సిలువ, చంద్రవంకలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు సరికావని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని నరసరావుపేటకు చెందిన కొందరు అధికారులు చెడగొడుతున్నారని ఆరోపించారు. పలువురు హిందూ సంఘాల నేతలు నిరసనలకు దిగడంతో కోటప్పకొండ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మతసామరస్యం కోసమే తామిలా విగ్రహాన్ని రూపొందించినట్టు శిల్పులు వెల్లడిస్తుండగా, మహా శివరాత్రి సమీపిస్తున్న వేళ, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ ప్రతిమను వెంటనే అక్కడి నుంచి తీసిివేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. 

More Telugu News