vijay antony: సమంత చేతుల మీదుగా 'కాశి' మూవీ సాంగ్ రిలీజ్!

  • విజయ్ ఆంటోనీ హీరోగా 'కాశి' 
  • తమిళంలో టైటిల్ 'కాళి'
  • రెండు భాషల్లో మార్చి 30న రిలీజ్   

తెలుగు .. తమిళ భాషల్లో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వుంది. 'డాక్టర్ సలీమ్' .. 'బిచ్చగాడు' .. ' నకిలీ' .. 'భేతాళుడు' వంటి విభిన్నమైన కథా చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆయన తాజా చిత్రంగా తెలుగులోకి 'కాశి' రానుంది. తమిళంలో 'కాళి' పేరుతో కిరుతిగ ఉదయనిధి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి తెలుగులో 'కాశి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, 'అందమా .. అందమా నన్ను ఎత్తుకుపో ' అనే మొదటి సాంగ్ ను కొంతసేపటి క్రితం సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట అందంగా .. ఆహ్లాదంగా కొనసాగింది. హృద్యమైన సంగీతంతో మనసును ఆకట్టుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు

More Telugu News