stock markets: మార్కెట్ కబుర్లు: ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్.. బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడి!

  • 111 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 16 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు

గత ఆరు సెషన్లుగా లాభాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు పతనం కావడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేడు ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు పతనమై 36,050 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 35 వేల దిగువకు కూడా వచ్చింది. నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 11,070 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (9.92%), ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (6.22%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (4.39%), యూకో బ్యాంక్ (4.27%), గ్రీవ్స్ కాటన్ (3.88%).

టాప్ లూజర్స్:
జిందాల్ సా లిమిటెడ్ (-7.97%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-7.07%), సిండికేట్ బ్యాంక్ (-6.92%), యూపీఎల్ (-6.47%), ఇండియన్ బ్యాంక్ (-6.27%)          

More Telugu News