dog: సీన్ రివర్స్.. కుక్కను కరిచిన మనిషి!

  • నిందితులను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు
  • ఇంట్లో దాక్కున్న నిందితులు
  • కంగారు పడి పోలీసుల జాగిలాన్ని కొరికిన నిందితుడు
  • అమెరికాలో ఘటన

'మ‌నిషిని కుక్క క‌రిస్తే అది వార్త కాదు.. మ‌నిషి కుక్క‌ని క‌రిస్తేనే వార్త' అనేది జర్నలిజంలో ప్రవేశించే కొత్తలో అందరికీ చెప్పే ప్రాథమికాంశం. కానీ, ఇప్పుడు నిజంగానే కుక్కను మ‌నిషి క‌రిచిన విచిత్ర‌ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్ద‌రిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో నిందితులు ఇంట్లో క‌న‌ప‌డ‌కుండా దాక్కున్నారు. పోలీసుల వెంట వచ్చిన జాగిలం మాత్రం వారిని గుర్తించింది.

దీంతో కంగారు ప‌డిపోయిన నిందితుల్లో ఒక‌డు ఆ జాగిలాన్ని గట్టిగా పట్టుకుని, దాని త‌లను కొరికేశాడు. దీంతో దానికి తీవ్ర గాయాల‌య్యాయి. అనంత‌రం ఓ అధికారిపై కూడా దాడి చేసి త‌ప్పించుకోవాల‌నుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు నిందితుల‌ను అరెస్ట్‌ చేశారు. ఆ ఇద్ద‌రు నిందితులు న్యూ హ్యాంప్‌షైర్‌ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. 

More Telugu News