బంగారం ధరకు రెక్కలు.. రెండేళ్ల గరిష్ట స్థాయికి పుత్తడి

- రూ. 30,405కు చేరుకున్న బంగారం ధర
- డాలర్ పతనమే కారణం
- ధర మరింత పెరుగుతుందన్న రాయిటర్స్ విశ్లేషకుడు
అమెరికన్ డాలర్ విలువ పతనం కావడానికి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యుచిన్ చేసిన వ్యాఖ్యలే కారణం. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఆయన మాట్లాడుతూ వాణిజ్యానికి, ఇతర అవకాశాలకు సంబంధించినంత వరకు డాలర్ బలహీనం కావడం తమకు మంచిదేనని అన్నారు. దీంతో, మార్కెట్లో డాలర్ అమ్మకాలకు తెరలేచింది. దీని ప్రభావంతో, పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి.