pa: సుప్రీంకోర్టులో ఆ నాలుగు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ పిటిషన్

  • 'పద్మావత్' ప్రదర్శన బాధ్యత రాష్ట్రాలదే అన్న సుప్రీం
  • నాలుగు రాష్ట్రాల్లో విడుదల కాని సినిమా
  • వీటిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

'పద్మావత్' సినిమాను అడ్డుకోరాదని... సినిమా ప్రదర్శనకు అడ్డంకులు కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాలేదు. థియేటర్లను తగులబెడతారనే భయంతో షో వేయడానికే థియేటర్ యాజమాన్యాలు భయపడ్డాయి.

ఈ నేపథ్యంలో, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం ద్వారా, కోర్టు ధిక్కరణకు ఈ నాలుగు రాష్ట్రాలు పాల్పడ్డాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు భద్రతా చర్యలను చేపట్టడంలో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు, రాజ్ పుత్ కర్ణిసేనకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులపై కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. 

More Telugu News