lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా లావణ్య 
  • 'రంగస్థలం' కోసం ఐటెం సాంగ్ 
  • సమంత సరసన రాహుల్ రవీంద్రన్ 
  • శర్వా, సాయిపల్లవి చిత్రం టైటిల్  

*  లేత సోయగాల చిన్నది లావణ్య త్రిపాఠీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ గా కనిపించనుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా రూపొందుతున్న 'ఇంటిలిజెంట్' చిత్రంలో లావణ్య ఇలా సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని పాత్ర పోషిస్తోందట.
*  రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చరణ్, పూజా హెగ్డేలపై ప్రస్తుతం ఐటెం సాంగును అక్కడ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
*  కన్నడలో హిట్టయిన 'యూ టర్న్' చిత్రాన్ని చెన్నయ్ బ్యూటీ సమంత తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్న సంగతి విదితమే. కన్నడ ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సమంత సరసన రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నాడు. వచ్చే నెలలో ఇది సెట్స్ కి వెళుతుంది.
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం నేపాల్ లో ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం కోసం 'పడిపడి లేచే మనసు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.

More Telugu News