memory card: 512 జీబీ మెమొరీ కార్డును విడుద‌ల చేసిన యూకే కంపెనీ

  • ప్రపంచంలో అత్య‌ధిక స్టోరేజ్ ఉన్న మెమొరీ కార్డు ఇదే
  • సాన్ డిస్క్ వారి 400 జీబీ ఎస్‌డీ కార్డ్ రికార్డు బ్రేక్‌
  • ఇంకా ధ‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించ‌ని ఇంటెగ్ర‌ల్ సంస్థ‌

నానో టెక్నాల‌జీ పుణ్య‌మాని చిన్న ప‌రిమాణాల్లో ఎక్కువ డేటాను భ‌ద్ర‌ప‌ర‌చ‌గ‌ల మెమొరీ చిప్‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సాన్ డిస్క్ వారు త‌యారుచేసిన 400 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డు ప్ర‌పంచంలో అత్య‌ధిక స్టోరేజీ గ‌ల మెమొరీ కార్డుగా ఉండేది. ఇప్పుడు కొత్త‌గా యూకేకి చెందిన ఇంటెగ్ర‌ల్ మెమొరీ పీఎల్‌సీ అనే కంపెనీ త‌యారు చేసిన మైక్రో ఎస్‌డీ కార్డు ఆ రికార్డును బ్రేక్ చేసింది.

దీని కెపాసిటీ 512 జీబీ. క్లాస్ 10 స్పెసిఫికేషన్స్‌తో తయారు చేయబడిన ఈ కార్డులో డేటాను 10 ఎంబీపీఎస్ పెర్ సెకండ్ స్పీడ్‌తో రైట్ చేసుకోవచ్చు. అలాగే గరిష్టంగా 80 ఎంబీపీఎస్ పెర్ సెకండ్ రైట్ స్పీడ్‌ను ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది. 5 సంవత్సరాల వారంటీతో ఈ కార్డు యూజర్లకు లభ్యం కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కార్డును మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే, దీని ధరకు సంబంధించిన‌ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

More Telugu News