stock markets: గత ఐదు సెషన్లుగా సంచలనాలు... ఈ రోజు తగ్గిన మార్కెట్ స్పీడు!

  • ఐదు రోజుల రికార్డులకు బ్రేక్
  • స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
  • ఆరున్నర శాతం నష్టపోయిన ఎయిర్ టెల్

గత ఐదు సెషన్ల నుంచి రికార్డుల మోత మోగిస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు కాస్త నెమ్మదించాయి. నేడు డెరివేటివ్ కాంట్రాక్టులు ముగుస్తున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు స్వల్ప లాభాలను మాత్రమే నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 22 పాయింట్ల స్వల్ప లాభంతో 36,162 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,086 వద్ద క్లోజ్ అయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (20.00%), ఎన్ఐఐటి టెక్నాలజీస్ (9.97%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (8.03%), హెక్సావేర్ టెక్నాలజీస్ (7.51%), అమరరాజా బ్యాటరీస్ (6.73%).

టాప్ లూజర్స్:
రాడికో ఖైతాన్ లిమిటెడ్ (-8.00%), భారతీ ఎయిర్ టెల్ (-6.51%), డెల్టా కార్ప్ లిమిటెడ్ (-6.24%), దేవాన్ హౌసింగ్ (-5.90%), క్రాంప్టన్ గ్రీవ్స్ (-5.75%).  

More Telugu News