america: పాక్ ఉగ్ర స్థావరాలపై పంజా విసిరిన అమెరికా.. దాడిని ఖండించిన పాక్

  • హక్కానీ నెట్ వర్క్ స్థావరంపై దాడి
  • డ్రోన్ తో రెండు మిస్సైళ్లను వదిలిన అమెరికా
  • దాడిని ఖండించిన పాక్

పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా దాడులు జరిపింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై డ్రోన్ సాయంతో డాడి చేసింది. ఈ దాడిలో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన ఓ కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో, డ్రోన్ తో అమెరికా బలగాలు దాడి చేశాయి. నిర్దేశిత స్థలంపై రెండు మిస్సైళ్లను వదిలాయి.

ఆఫ్ఘాన్ ను అతలాకుతలం చేస్తున్న తాలిబన్లతో హక్కానీ నెట్ వర్క్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో, ఈ నెట్ వర్క్ ను తుద ముట్టిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హక్కానీ నెట్ వర్క్ కమాండర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ కు ఆర్థిక సాయాన్ని కూడా అమెరికా నిలిపివేసింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిని పాకిస్థాన్ ఖండించింది. 

More Telugu News