బ్లడ్ క్యాన్సర్ బాధిస్తున్నా... చివరి రోజుల్లో ఒంటరిగా గడిపిన నటి కృష్ణకుమారి!

24-01-2018 Wed 11:57
  • బెంగళూరు శివార్లలో ఫామ్ హౌస్
  • భర్త కట్టించిన ఇంట్లోనే ఉండేందుకు కృష్ణకుమారి ఆసక్తి
  • అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూత
బెంగళూరులో ఈ ఉదయం మరణించిన అలనాటి నటి కృష్ణకుమారి, తన చివరి రోజులను ఒంటరిగా గడిపినట్టు తెలుస్తోంది. తన భర్త అజయ్ మోహన్ నగర శివార్లలో ఎంతో ఇష్టపడి కట్టించి ఇచ్చిన ఫామ్ హౌస్ ను వదిలి వెళ్లలేక, అక్కడే ఉండిపోయారు. తన భర్త ప్రేమగా కట్టించి ఇచ్చిన ఆ భవంతిని వదలడం తనకు ఇష్టంలేదని తన చివరి ఇంటర్వ్యూల్లో ఆమె వ్యాఖ్యానించారు.

కుమార్తె దీపిక తనతోనే ఉండాలని ఒత్తిడి తెచ్చినా కృష్ణకుమారి అంగీకరించలేదు. ఫామ్ హౌస్ లోని పచ్చదనం తనకెంతో నచ్చుతుందని చెప్పే ఆమె, అక్కడే జీవనం గడుపుతూ, తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తోపాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న ఆమె, వయసు పైబడిన కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారట.