rajashekhar: '2 స్టేట్స్‌' రీమేక్ తో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాని అరంగేట్రం!

  • తెరంగేట్రం చేయనున్న శివాని
  • `2 స్టేట్స్‌` సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ
  • హీరో గా అడ‌వి శేష్

హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి సంబంధించిన సమాచారం వెల్లడైంది.

బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్‌ నటించిన `2 స్టేట్స్‌` సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అడ‌వి శేష్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ  సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

More Telugu News