sun: సూర్యుడికి వయసుపైబడిందా?... ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడా?

  • సూర్యుడికి వృద్ధాప్యం
  • ఆ కారణంగా దూరం జరుగుతున్న బుధుడు
  • మెసేంజర్ ఉపగ్రహం పంపిన సందేశాల్లో వెల్లడైన రహస్యం

భూమిపై జీవించే ప్రతి జీవికి వృద్ధాప్యం సాధారణం. ఇప్పుడు ఈ వృద్ధాప్య ఛాయలు సూర్యుడికి కూడా వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వృద్ధాప్య ఛాయల కారణంగా సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగానే దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం పుట్టిన సూర్యుడుకి గ్రహాలు దూరంగా జరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 దీనికి బుధ గ్రహం కక్ష్యలో వచ్చిన మార్పులే నిదర్శనమని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని నాసా పంపిన 'మెసేంజర్‌' అనే అంతరిక్ష నౌక (ఈ అంతరిక్ష నౌక మార్చి 2011 నుంచి ఏప్రిల్‌ 2015 మధ్య బుధగ్రహం చుట్టూ తిరుగుతూ పలు కీలక సందేశాలను భూమిపైకి పంపింది.) వెల్లడించిందని తెలిపారు. ఐన్‌ స్టీన్‌ ప్రతిపాదించిన ‘సాపేక్ష సిద్ధాంతాన్ని’ అన్వయిస్తూ మేసేంజర్‌ సందేశాలను పరిశీలించగా ఈ విషయం బహిర్గతమైందని వారు వెల్లడించారు. అయితే, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిపై రేగుతున్న అనుమానాలు నిర్ధారించుకునేందుకు మరిన్ని సమగ్ర పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

More Telugu News