rana: రానాకు విమాన ప్ర‌యాణ క‌ష్టాలు.. ట్వీట్ ద్వారా ఓదార్చిన కాజ‌ల్‌!

  • ఎయిర్ ట్రాఫిక్ దృష్ట్యా విమానాల మ‌ళ్లింపు
  • అరగంట‌సేపు ముంబై ట్రాఫిక్‌లో రానా ఇబ్బందులు
  • ఇలాంటివి వేస్ట్ ఆఫ్ టైం అంటూ కాజ‌ల్ రిప్లై

నిన్న ద‌గ్గుబాటి రానా హైదరాబాదు నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే, అక్కడ ఎయిర్‌ ట్రాఫిక్, పార్కింగ్ స‌మ‌స్య‌ల‌ దృష్ట్యా ఆ విమానాన్ని డొమెస్టిక్ విమానాశ్ర‌యానికి మళ్లించి, అక్కడే ల్యాండ్ చేశారు. దీంతో ఆయన తిరిగి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి వెళ్ల‌డానికి విమానాశ్రయం ఏర్పాటు చేసిన బస్సు ఎక్కాల్సి వచ్చింది. దీంతో ముంబై ట్రాఫిక్‌లో అర‌గంటపాటు చిక్కుకుపోయాడట. ఈ ఇబ్బందిని ఆయ‌న ఓ ట్వీట్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

ఆ ట్వీట్‌కి ఆయ‌న బెస్ట్‌ఫ్రెండ్, న‌టి కాజ‌ల్ కామెంట్ చేసింది. 'అవన్నీ ఎయిర్‌ ట్రాఫిక్‌ సమస్యలు. ఇలాంటి సమస్యలు ఈ మధ్య దారుణంగా మారుతున్నాయి. వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌' అంటూ రానాను కాజ‌ల్ ఓదార్చింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. 'నెం. 1 యారి' కార్య‌క్ర‌మంలో ఇండ‌స్ట్రీలో త‌న బెస్ట్ ఫ్రెండ్ రానా అని కాజ‌ల్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News