investments: జపాన్ ను దాటేయనున్న భారత్... పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయం

  • జపాన్ ను దాటుకుని ఐదో స్థానానికి భారత్
  • నిపుణుల అంచనాలు
  • 2018లో మరింత వృద్ధికి అవకాశాలు
  • ప్రైస్ వాటర్ హౌస్ నివేదిక

ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశంగా భారత్ ఐదో స్థానంలోకి వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 2018లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సైతం స్పష్టం చేసింది. ఆర్థిక రికవరీ వాతావరణం కనిపిస్తుండడంతో ఈ మేరకు అంచనా వేసింది. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.

అమెరికా, చైనాలు పెట్టుబడుల ఆకర్షణకు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయని, అమెరికాలో వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకుంటుందని పేర్కొంది. చైనా తన పాప్యులారిటీని పెంచుకుంటుందని, భారత్ తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకుని జర్మనీ, బ్రిటన్ తో సమానంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సర్వే స్పష్టం చేసింది. దావోస్ లో అంతర్జాతీయ ఆర్థిక పోరం సమావేశం నేపథ్యంలో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న జపాన్ ఆరుకు పడిపోనుంది. బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉంటాయి. 

More Telugu News