Shahrukh Khan: తన పోజును తానే అనుక‌రించిన షారుక్ ఖాన్‌... వైర‌ల్ అవుతున్న ఫొటో

  • మంచులో త‌న పోజు పెట్టి ఫొటో దిగిన షారుక్‌
  • స్విట్జ‌ర్లాండ్‌లో ఉన్న న‌టుడు
  • క్రిస్ట‌ల్ అవార్డ్స్ వేడుక‌కు హాజ‌రు

షారుక్ ఖాన్ అన‌గానే రొమాంటిక్ లుక్కిస్తూ చేతులు చాచి నిల‌బ‌డి ఉన్న పోజు గుర్తొస్తుంది... చాలా మంది ఈ పోజుని అనుక‌రిస్తూ ఫొటోలు దిగుతుంటారు. కానీ షారుక్ ఖాన్ పోజును షారుక్ ఖానే అనుక‌రిస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది. క్రిస్ట‌ల్ అవార్డ్స్ వేడుక‌లో పాల్గొన‌డానికి స్విట్జ‌ర్లాండ్ వెళ్లిన ఆయ‌న అక్క‌డి మంచులో ఈ ఫొటో దిగి పోస్ట్ చేశాడు.

ఆయ‌న నటించిన 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' చిత్రం స్విట్జ‌ర్లాండ్‌లోనే జ‌రిగింది. ఆ జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చి ఈ పోజు పెట్టిన‌ట్లు షారుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అక్క‌డి దావోస్‌లో జ‌రిగిన 24వ క్రిస్ట‌ల్ అవార్డుల వేడుక‌లో హాలీవుడ్ తార‌లు ఎల్ట‌న్ జాన్‌, కేట్ బ్లాంచెట్‌ల‌తో క‌లిసి ఆయ‌న అవార్డు అందుకున్నారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల హ‌క్కులు కాపాడ‌టం కోసం త‌న‌దైన కృషి చేస్తున్న కార‌ణంగా ఆయ‌న‌కు ఈ అవార్డు అంద‌జేస్తున్న‌ట్లు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వెల్ల‌డించింది.

More Telugu News