aeroplane: ఇక విమానాల్లో సెల్ఫీ యోగం... ఆపై ఫేస్ బుక్ లో పోస్టింగ్!

  • సేవలకు అనుమతించిన ట్రాయ్
  • వాటిని త్వరలోనే ప్రారంభించే యోచనలో విమానయాన సంస్థలు
  • డేటా చార్జీలు భారీగా ఉండే అవకాశం

విమానంలో ప్రయాణిస్తూ సెల్ఫీ తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ఆ మజాయే వేరు! సెల్ఫీ ప్రియులకు త్వరలోనే ఇది సాకారం కానుంది. విమానాల్లో కాల్స్ కు, డేటా వినియోగానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆమోదం తెలిపినందున ఈ సేవలు ప్రారంభించే ఆలోచనతో విమానయాన సంస్థలు ఉన్నాయి. కాకపోతే విమానాల్లో డేటా వినియోగానికి భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఓ గంట పాటు డేటా వాడకానికి చెల్లించాల్సిన చార్జీ రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉండే అవకాశం ఉంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వారికి ఈ సేవలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే విమానాల్లో డేటా చార్జీలను వసూలు చేసే ఆలోచనతో ఆయా సంస్థలు ఉన్నాయి.

More Telugu News