hispeeed trains: ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ నుంచి రెండు అత్యాధునిక రైళ్లు

  • ఇప్పుడున్న రైళ్ల కంటే 20 శాతం వేగంగా ప్రయాణం
  • వైఫై, అత్యాధునిక వసతులు
  • చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారీ

ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెండు అత్యాధునిక రైళ్లను రూపొందిస్తోంది. ఇప్పుడున్న రైళ్లతో పోలిస్తే ఇవి 20 శాతం తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేర్చగలవు. వీటినే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ గా పేర్కొంటున్నారు. చెన్నైకు చెందిన రైల్వే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతున్నాయి.

ముందుగా ట్రెయిన్18 పేరుతో 16 పూర్తి ఏసీ ఆధారిత కోచ్ లతో కూడిన తొలి రైలు ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైల్లో వైఫై, వినోదం, జీపీఎస్ వ్యవస్థలు, ఎల్ఈడీ దీపాలు, ఆకట్టుకునే ఇంటిరీయర్ ఉంటాయి. రైలుకు ముందు భాగం సన్నగా పొడవుగా, ఎయిరో డైనమిక్ స్టయిల్ తో ఉంటుంది. శతాబ్ది రైళ్ల స్థానంలో ఈ రైళ్లను తీసుకొచ్చే ఆలోచనతో అధికారులు ఉన్నారు. ట్రెయిన్ 20 పేరుతో మరో రైలు 2020 నాటికి సిద్ధం కానుంది. రాజధాని రైళ్ల స్థానంలో ఈ రైలును ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News