Ramcharan: రూ.30 కోట్లకు రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమా నైజాం, సీడెడ్ హక్కులు!

  • షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ‘రంగస్థలం 1985’ సినిమా
  • ఇప్పటికే భారీ ధరకు అమ్ముడైన శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు 
  • అభిమానుల్లో భారీ అంచనాలు

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రూపొందిస్తోన్న ‘రంగస్థలం 1985’ సినిమా నైజాం, సీడెడ్ హక్కులు సుమారు రూ.30 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. అలాగే ఇప్పటికే ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు రూ.20 కోట్ల రేటుకు పైగానే అమ్ముడయ్యాయి. మరోవైపు హిందీ శాటిలైట్ హక్కులు రూ.10.50 కోట్లకు ఓ ఛానెల్ కొనుగోలు చేయగా, ఆడియో హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడయ్యాయి.  

More Telugu News