ramgopal varma: నాగార్జున, వర్మ సినిమా టైటిల్ 'శపథం'?

  • పోలీసాఫీసర్ గా నటిస్తున్న నాగ్ 
  • ఇంకా ఖరారు కాని టైటిల్
  • త్వరలో ఈ అస్పష్టతకు తెర

ఒకప్పటి హిట్ కాంబినేషన్ రాంగోపాల్ వర్మ, నాగార్జున కలయికలో తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఓ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున పోలీసాఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కథానాయికగా మైరా సరీన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టేందుకు నన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా, ఈ చిత్రానికి 'శపథం' అనే టైటిల్ ను పెట్టాలని వర్మ అనుకుంటున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ గానీ, వర్మ గానీ ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. లోగడ కూడా ఈ చిత్రానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని పేర్లు వినిపించాయి. మరి ఈ టైటిల్ అయినా ఖరారవుతుందో లేదో చూడాలి.

More Telugu News