google play: గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్‌... త్వ‌ర‌లో అందుబాటులోకి!

  • మొదటి బుక్ మీద 50 శాతం డిస్కౌంట్‌
  • గూగుల్ ప్లే బుక్స్ ద్వారా వినే స‌దుపాయం
  • అమెజాన్‌కి పోటీ ఇచ్చే ప్ర‌య‌త్నం

గంట‌ల త‌ర‌బ‌డి పుస్త‌కం చ‌ద‌వ‌డం ఆస‌క్తి లేనివారు... పుస్త‌కాన్ని వినే స‌దుపాయాన్ని ఆడియో బుక్స్ క‌ల్పిస్తాయి. ప్ర‌స్తుతం వేల సంఖ్య‌లో ఆన్‌లైన్ పుస్త‌కాల‌ను అంద‌జేస్తున్న గూగుల్, త్వ‌ర‌లో ఆడియో బుక్స్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే బుక్స్ అప్‌డేట్ చేసుకోవ‌డం ద్వారా ఈ ఆడియో బుక్స్‌ను వినే అవ‌కాశం క‌లుగుతుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి బ్యాన‌ర్ యాడ్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో విడుద‌ల చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం యూజ‌ర్లు కొన్న మొద‌టి బుక్ మీద 50 శాతం డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్లు గూగుల్ పేర్కొంది. కిండెల్ పేరుతో ఈ-బుక్స్‌తో పాటు ఆడియో బుక్స్‌ను కూడా అమెజాన్ అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక గూగుల్ కూడా ఆడియో బుక్స్‌ను ప్ర‌వేశ‌పెడితే అమెజాన్ కి గ‌ట్టి పోటీ ఏర్ప‌డనుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

More Telugu News