Sunny Leone: ఆ ఫోటోలు వాడడంతోనే బెంగళూరు షో రద్దు చేసుకున్నాను: సీక్రెట్ విప్పిన సన్నీ లియోన్

  • షో ప్రచారం కోసం 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోలు వాడడం బాధించింది
  • ఆ ఈవెంట్ లో పాల్గొనేంత పెద్ద సెలబ్రిటీని కాదు
  • నా అభిమానులతో పాటు, మీడియా మద్దతుగా నిలిచింది 

శృంగార నటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టి...స్టార్ గా ఎదిగిన నటి సన్నీ లియోన్. న్యూఇయర్ సందర్భంగా ఆమె బెంగళూరులో నిర్వహించిన వేడుకలో పాల్గొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆమె ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దానిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఆ షో రద్దు కావడానికి కారణం కచ్చితంగా తెలీదు...కానీ, ఆ ఘటన తనను చాలా బాధించిందని ఆమె అన్నారు.

బెంగళూరులో నిర్వహించాల్సిన ఆ ఈవెంట్‌ ప్రచారం కోసం 15 ఏళ్ల క్రితం నాటి తన ఫొటోలను వాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి ఈవెంట్‌ లో పాల్గొనేంత పెద్ద సెలబ్రిటీని కాదని ఆమె వ్యంగ్యంగా చెప్పింది. ఆ సమయంలో తన అభిమానులతో పాటు, మీడియా మద్దతుగా నిలిచిందని ఆమె ధన్యవాదాలు తెలిపింది. అలాంటి సమయాల్లో ఎంత సున్నితంగా మాట్లాడితే ప్రేక్షకులు అంత బాగా అర్థం చేసుకుంటారని సన్నీ లియోన్ తెలిపింది. 

More Telugu News