Pawan Kalyan: 'ఆ వేలు కాదు... రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్': భార్యకు తిలకం దిద్దడం నేర్పించిన పవన్ కల్యాణ్

  • పవన్ కు వీడ్కోలు పలికే వేళ ఆసక్తికర ఘటన
  • తిలకం ఎలా దిద్దాలో తెలియని అన్నా
  • స్వయంగా చెప్పి నేర్పించిన పవన్

ఈ ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొండగట్టుకు బయలుదేరిన వేళ, ఆయన భార్య అన్నా లెజినోవా స్వయంగా హారతిచ్చి, వీడ్కోలు పలికిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. లైట్ మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న అన్నా, పవన్ కు ఎదురు వచ్చి తిలకం దిద్దుతున్న వేళ, ఆమెకు తిలకం ఎలా పెట్టాలో తెలియలేదు.

ఆమె చూపుడు వేలితో కుంకుమను చేతికి తీసుకోబోగా, స్పందించిన పవన్, ఆ వేలితో కాదని, కుడి చేయి ఉంగరపు వేలితో ఇలా కుంకుమ దిద్దాలని చూపించారు. ఆపై అన్నా ఆయనకు అలానే కుంకుమ దిద్దగా, ఈ ఘటన మొత్తం మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అవుతోంది.

More Telugu News