Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • టాంగో డ్యాన్స్ నేర్చుకున్న తమన్నా 
  • వెంకటేష్ సినిమాలో నారా రోహిత్ 
  • మంజుల 'మనసుకు నచ్చింది' సెన్సార్ పూర్తి 
  • బెల్లంకొండ శ్రీనివాస్ స్పోర్ట్స్ డ్రామా

*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా టాంగో డ్యాన్స్ నేర్చుకుంది. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 'నా నువ్వే' చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాట కోసం బృంద మాస్టర్ నేతృత్వంలో టాంగో డ్యాన్స్ నేర్చుకుందట. ఇది చాలా కష్టమైన డ్యాన్స్ అనీ, ఈ సందర్భంగా  ఓసారి పడిపోవడం వల్ల దెబ్బలు కూడా తగిలాయని తమన్నా చెప్పింది.
*  సీనియర్ నటుడు వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో వీరిద్దరూ బావాబావమరుదులుగా కనిపిస్తారట.
*  మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో రూపొందిన 'మనసుకు నచ్చింది' చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
*  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓంకార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 'బెంగాల్ టైగర్' చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ 25  కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.   

More Telugu News