nara lokesh: కేసీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్!

  • నిజమే తెలంగాణకు, ఏపీకి పోలిక లేదు
  • మాకు కియా, హీరో, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ లాంటివి వచ్చాయి
  • తెలంగాణలో ఆ పరిస్థితి లేదు

ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు, ఏపీకి మధ్య పోలికే లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలి స్థానానికి ఎదుగుతామని ఆయన అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే తెలంగాణ సంపన్న రాష్ట్రమని చెప్పారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు, ఏపీకి మధ్య పోలిక లేదనే విషయం నిజమే కదా అని... ఏపీకి కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ వచ్చాయని... తెలంగాణలో ఆ పరిస్థితి లేదని సెటైర్ వేశారు. ఏపీకి బడా కంపెనీలు తరలి వస్తున్నాయని, భారీ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.

More Telugu News