Tirupati: టీటీడీ సరికొత్త ఆఫర్!.. ఇక కరెంటు బుకింగ్ భక్తులకు కూడా ప్రోత్సాహకం!

  • గదులను ముందుగా ఖాళీ చేస్తే ప్రోత్సాహకం ఇస్తున్న టీటీడీ
  • ఇకపై కరెంట్ బుకింగ్ భక్తులకూ అందుబాటులోకి
  • సాఫ్ట్‌వేర్‌లో మార్పులు.. ఈ నెలాఖరు నుంచే

తిరుమల తిరుపతిలో అద్దె గదుల విషయంలో భక్తులు పడుతున్న అవస్థలను తొలగించేందుకు టీటీడీ నడుంబిగించింది. భక్తులు తమకు కేటాయించిన గదులను నిర్దేశిత వ్యవధి కంటే ముందుగా ఖాళీ చేస్తే ప్రోత్సాహకంగా కొంత మొత్తాన్ని అందిస్తున్న టీటీడీ ఇకపై ఈ సదుపాయాన్ని కరెంట్ బుకింగ్ కింద గదులు బుక్ చేసుకునే భక్తులకు కూడా అందించాలని యోచిస్తోంది. ఈ నెలాఖరు నుంచే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం తిరుమలలో మొత్తం 6500 వరకు అద్దె గదులు ఉండగా, ఇంటర్నెట్‌లో 1500 గదులను భక్తులకు కేటాయిస్తోంది. ఒక రోజు కాలపరిమితితో భక్తులకు గదులను కేటాయిస్తున్న టీటీడీ, ఆన్‌లైన్‌లో గదులు పొందిన వారు 18 గంటలలోపు ఖాళీ చేస్తే అద్దెలో 25 శాతం, 12 గంటలలోపు అయితే 50 శాతం తిరిగి ఇస్తోంది. ఇకపై ఈ విధానాన్ని కరెంట్ బుకింగ్ యాత్రికులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనుంది. అలాగే గదులు పొందిన భక్తులు 24 గంటలలోపు వాటిని తప్పనిసరిగా ఖాళీ చేయాలనే నిబంధన కూడా విధించనుంది. లేదంటే రూ.100 నుంచి రూ.150 వరకు  అద్దెను పెంచాలని నిర్ణయించింది.

More Telugu News