chandrababu: సీ-ఓటర్ సర్వే ఓ బూటకం.. ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది?: చంద్రబాబు

  • ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాం
  • ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు
  • కోడి పందేలు ఆడించడానికి ప్రజలు మీకు ఓట్లు వేయలేదు

రిపబ్లిక్ టీవీ సీ-ఓటర్ సర్వే ఓ బూటకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటానికి కారణమేముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అడిగినవి, అడగనివి అన్నీ తాము చేశామని చెప్పారు. ఎన్నడూ జరగని మంచి పనులను తాము చేస్తున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుందని అన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపించామని తెలిపారు.

మరోవైపు, కోడి పందేలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కోడి పందేలు అలవాటు లేని ప్రాంతాల్లో కూడా కొందరు వాటిని ప్రోత్సహిస్తున్నారని... ఇది మంచిది కాదని అన్నారు. నాయకులే తలపాగా చుట్టి, కోడి పందేల బరిలోకి దిగడం సరైంది కాదని చెప్పారు. కోడి పందేలు ఆడిస్తారనే భావనతో ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని ప్రశ్నించారు. తన మనోభావాలు తెలిసినవారు ఎవరూ అలాంటి పని చేయరని చెప్పారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.

More Telugu News