Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రకుల్ ఇక బాలీవుడ్ చెక్కేస్తుందా?
  • ముంబయ్ లో నాగ్, వర్మ సినిమా షూటింగ్
  • తొలిప్రేమ పాటలు వచ్చేశాయ్ 
  • అఖిల్ మూడో సినిమా ఖరారు     

*  తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే 'అయ్యారీ' చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా అజయ్ దేవగణ్ సరసన నటించే చాన్స్ వచ్చింది. అలాగే ప్రస్తుతం మరికొన్ని ప్రాజక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. దీంతో ఇక బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాలని చిన్నది నిర్ణయించుకుందని అంటున్నారు.
*  నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తాజా షెడ్యూలు ముగిసింది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 26 నుంచి పదిహేను రోజుల పాటు ముంబయ్ లో నిర్వహిస్తారు. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
*  వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'తొలిప్రేమ' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.
*  అఖిల్ అక్కినేని తన మూడవ చిత్రాన్ని సత్య పినిశెట్టి (రవిరాజా పినిశెట్టి తనయుడు) దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. సత్య చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజక్టు ఓకే అయిందని అంటున్నారు.         

More Telugu News