samanta: సమంత మూవీ మళ్లీ వాయిదా పడింది!

  • విశాల్ జోడీగా సమంత 
  • తమిళంలో  'ఇరుంబు తిరై' 
  • తెలుగులో 'అభిమన్యుడు'
  • మార్చ్ లో భారీ స్థాయి విడుదల

తెలుగులో చరణ్ తో 'రంగస్థలం' సినిమా చేస్తోన్న సమంత, తమిళంలో విశాల్ జోడీగా 'ఇరుంబు తిరై' సినిమా చేసింది. తెలుగులో ఈ సినిమాకి 'అభిమన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి పనులు పూర్తి కాకపోవడం వలన, జనవరి 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు.

విడుదల సమయం దగ్గర పడుతుండగా, ఇప్పుడు ఆ డేట్ ను కూడా మార్చ్ నెలకు మార్చారనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమా కూడా మార్చ్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఈ రెండు సినిమాలు మార్చ్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయన్న మాట. రెండు భాషల్లోనూ సమంతకి హిట్స్ పడతాయేమో చూడాలి మరి.          

More Telugu News