kvp: విభజన హామీల అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్రపతికి కేవీపీ లేఖ !

  • ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని వినతి
  • భారత రాజ్యాంగం ఆర్టికల్ 78 ద్వారా నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి

నాలుగేళ్లయినా విభజన అంశాల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొస్తూ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి ఈరోజు లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన, నిస్సహాయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లేఖలో వివరించారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రస్తావించిన అంశాలు సహా రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ నివేదిక తెప్పించుకోవాలని లేఖలో కోరారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 78 ద్వారా సంక్రమించిన విశేష అధికారాలను ఉపయోగించి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News