akshara hassan: కూతురు అక్ష‌ర హాస‌న్‌ సినిమాకి నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న క‌మ‌లహాస‌న్‌

  • హీరోగా న‌టించ‌బోతున్న విక్ర‌మ్‌
  • ద‌ర్శ‌కుడు రాజేశ్ ఎమ్ సెల్వ‌
  • ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన క‌మ‌లహాస‌న్‌

ఇటీవ‌ల రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌లహాస‌న్ త్వ‌ర‌లో త‌న కూతురు అక్ష‌ర హాస‌న్ న‌టించ‌బోతున్న సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ సినిమాలో విక్ర‌మ్ హీరోగా న‌టించ‌నుండ‌గా రాజేశ్ ఎమ్ సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు క‌మ‌ల్ తెలిపారు. ట్రైడెంట్ ఆర్ట్స్‌తో క‌లిసి త‌న రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్లు క‌మ‌ల్ ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

ఓ ఫ్రెంచి సినిమా ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ఈ సినిమా గురించి జ‌న‌వ‌రి 1వ తేదీనే ప్ర‌క‌టించాల్సి ఉంది. కానీ డిసెంబ‌ర్ 31న విక్ర‌మ్ తండ్రి చ‌నిపోవ‌డంతో ఈ ప్ర‌క‌ట‌న‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మిళంలో అక్ష‌ర హాస‌న్ న‌టించ‌బోతున్న రెండో చిత్రం ఇది. గ‌తంలో అజిత్‌తో క‌లిసి 'వివేగం' చిత్రంలో ఆమె హ్యాక‌ర్ పాత్ర‌లో క‌నిపించింది.

More Telugu News