saidharam tej: సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్ ఖరారు!

  • వినాయక్ దర్శకత్వంలో తేజు 
  • టైటిల్ గా 'ఇంటెలిజెంట్' 
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో 'ఇంటెలిజెంట్' చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత సి.కల్యాణ్ ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని అన్నారు. ప్రస్తుతం పబ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందనీ, ఈ నెల 25తో ఇది పూర్తవుతుందని చెప్పారు.

ఈ పాటతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్టు మొత్తం పూర్తవుతుందని అన్నారు. సాయిధరమ్ తేజ్ యాక్షన్ .. లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిపోయిన సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News