సూర్య ఎత్తు గురించి అవ‌మానించ‌డంపై అభిమానుల నిర‌స‌న‌... స్పందించిన న‌టుడు

20-01-2018 Sat 13:26
  • స‌న్ టీవీ కార్యాల‌యం ముందు అభిమానుల ధ‌ర్నా
  • శాంతించాల‌ని ప‌రోక్షంగా కోరిన సూర్య‌
  • గొడ‌వను చ‌ల్ల‌బ‌రిచేందుకు ప్ర‌య‌త్నించిన న‌టుడు

స‌న్ మ్యూజిక్‌ చానెల్ లో ప్ర‌సార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' కార్య‌క్ర‌మంలో యాంక‌ర్లు నివేదిత‌, సంగీత‌లు న‌టుడు సూర్య ఎత్తు గురించి కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో సూర్య న‌టించాలంటే కుర్చీ వేసుకోవాల‌ని వారు అన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ప‌లువురు త‌మిళ సినీప్ర‌ముఖులు, సూర్య అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో యాంక‌ర్ల‌ను బెదిరిస్తూ పోస్టులు, కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈరోడ్, న‌మ్మ‌క‌ల్ ప్రాంతాల‌కు చెందిన కొంత‌మంది అభిమానులు స‌న్ టీవీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా కూడా చేశారు.

దీనిపై న‌టుడు సూర్య స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'ద‌య‌చేసి మీ విలువైన‌ స‌మ‌యాన్ని, శ‌క్తిని ఉప‌యోగ‌ప‌డే ప‌నుల కోసం వెచ్చించండి. స‌మాజానికి అవ‌స‌ర‌మ‌య్యే ప‌నులు చేయండి' అని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్బానా ఫ్యాన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఉప‌యోగించ‌డంతో ప‌రోక్షంగా ఇది అభిమానుల‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌లాగే క‌నిపిస్తోంది. గొడ‌వను చ‌ల్ల‌బ‌రిచేందుకు ట్వీట్ ద్వారా సూర్య స్పందించ‌డాన్ని ప‌లువురు హ‌ర్షిస్తున్నారు.