sushma swaraj: ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్‌పోర్టు ఛార్జీల్లో 10 శాతం రాయితీ!

  • కారైకల్ లో పోస్టాఫీసులో పాస్ పోర్టు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) ప్రారంభించిన సుష్మా స్వరాజ్
  • ఇప్పటికే 60 పీవోపీఎస్కే కేంద్రాల ఏర్పాటు
  • దేశవ్యాప్తంగా 236 పీవోపీఎస్కే కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు

భవిష్యత్తులో వీలైనంత త్వరగా పాస్‌ పోర్టును అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పాస్‌ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతిని మరింత సులభతరం చేయాలని చూస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. తమిళనాడులోని కారైకల్ లోని పోస్టాఫీసులో పాస్ పోర్టు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్‌ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నామన్నారు.

దేశవ్యాప్తంగా 236 పీవోపీఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, ఇప్పటికే 60 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2017లో 19శాతం అధికంగా పాస్‌ పోర్టు అప్లికేషన్ల ప్రొసెసింగ్‌ జరిగిందని ఆమె తెలిపారు. కరైకల్‌ లో ప్రారంభించిన పీవోపీఎస్కే కేంద్రం ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు ఈ సేవలు పొందుతాయని ఆమె చెప్పారు. 

More Telugu News