padmavat: 'పద్మావత్'లో హడలెత్తిస్తున్న ఖిల్జీ.. ప్రోమో చూడండి!

  • ఖిల్జీ పాత్రలో హడలెత్తిస్తున్న రణవీర్
  • ఆకట్టుకున్న షాహిద్ డైలాగ్
  • 25న సినిమా విడుదల

అనేక వివాదాల మధ్య ఈ నెల 25న విడుదలకు 'పద్మావత్' సినిమా సిద్ధమవుతోంది. ఈ మూవీలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ హడలెత్తిస్తున్నాడు. తాజాగా, రణవీర్ డైలాగ్స్ తో ఓ ప్రోమోను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. తొలుత విడుదల చేసిన ప్రోమోలో కేవలం రాజ్ పుత్ ల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఖిల్జీ డైలాగ్స్ ను వినిపించారు. ఇందులో మహారావల్ రతన్ సింగ్ పాత్రను పోషించిన షాహిద్ కపూర్ డైలాగ్ కూడా ఉంది. ఖిల్జీ కత్తికన్నా రాజ్ పుత్ ల ఛాతీలోనే ఎక్కువ ధైర్యం ఉంటుందంటూ షాహిద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

More Telugu News