allari naresh: హిట్ కాంబినేషన్లో మరో మూవీకి రంగం సిద్ధం!

  • భీమనేని శ్రీనివాసరావుతో అల్లరి నరేష్ 
  • స్నేహితుడి పాత్రలో సునీల్
  • ఈ నెల 27వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్

ఓ దర్శకుడు .. ఓ హీరో కలిసి హిట్ కొడితే, ఆ వెంటనే గానీ .. కొంత గ్యాప్ తీసుకుని గాని వాళ్ల కాంబినేషన్లో మరో సినిమా వస్తుంటుంది. గతంలో చాలామంది విషయంలో ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. అలాగే ఓ సూపర్ హిట్ కొట్టిన మరో దర్శకుడు .. హీరో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మళ్లీ రెడీ అవుతున్నారు .. వాళ్లే అల్లరి నరేష్ - భీమనేని శ్రీనివాసరావు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ కాంబినేషన్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు .. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. 'సుడిగాడు'కి సంగీతాన్ని అందించిన శ్రీవసంత్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి సునీల్ ఫ్రెండ్ గా కనిపించనుండగా, హీరోయిన్ విషయంలో ఇంకా స్పష్టత రావలసి వుంది.    

More Telugu News