rajani kanth: తమిళనాట రజనీకాంత్ ముందంజ... ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సర్వేల వెల్లడి!

  • రజనీకాంత్ పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని తెలిపిన ఇండియా టుడే సర్వే
  • 33.7 శాతం ఓట్లతో రజనీకాంత్‌ పార్టీ 23 స్థానాలు కైవసం చేసుకుంటుంది 
  • తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ 

ఇంకా పేరు కూడా ప్రకటించని రజనీకాంత్ పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలలో మూడో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే సర్వే ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తేలింది.

దీంతో తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ అవుతారని సర్వే చేసిన సంస్థలు తేల్చాయి. రజనీ పార్టీ ప్రకటించి ఎన్నికల బరిలో దిగితే తమిళనాట మిగిలిన ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని, అంతే కాకుండా దేశ రాజకీయాలపై కూడా ఆయన ప్రభావం చూపుతారని రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

రాష్ట్రంలోని 39 స్థానాల్లో 28.3 శాతం ఓట్లతో 14 స్థానాలు డీఎంకే కైవసం చేసుకుంటుందని, 13.6 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కేవలం 2 స్థానాలు సొంతం చేసుకుంటుందని, 33.7 శాతం ఓట్లతో రజనీకాంత్‌ పార్టీ 23 స్థానాలను గెలుచుకుని, బలమైన పార్టీగా నిలుస్తుందని, ఇక కాంగ్రెస్‌, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని ఈ సర్వే వెల్లడించింది. 

More Telugu News