trai: ఇక విమానంలో ప్రయాణిస్తూ వాట్సాప్, ఫేస్ బుక్, కాల్స్ చేసుకోవచ్చు!: ట్రాయ్ సిఫారసు

  • విమానాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు
  • 3000 మీటర్ల ఎత్తులో అనుమతించాలని సిఫారసు
  • వార్షిక లైసెన్స్ రుసుముగా ప్రారంభంలో రూపాయి

‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌లను స్విచాఫ్ చేయండి’’ అంటూ విమానం టేకాఫ్ సమయంలో ఎయిర్‌హోస్టెస్ రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతవరకు భారత్‌లో ఏ విమానం ఎక్కినా ఇదే సీన్. కానీ ఇక నుంచి సీన్ మారబోతోంది. విమానంలో ప్రయాణిస్తూ కూడా మొబైల్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసుకునేందుకు అవకాశం అందుబాటులోకి రానుంది.

దేశీయ పరిధిలోని విమానాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అనుమతించాలని ట్రాయ్ సిఫారసు చేయడమే ఇందుకు కారణం. 3000 మీటర్ల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఈ సేవలను అనుమతించాలని పేర్కొంది. సాంకేతికంగా సాధ్యమైనప్పుడు, భద్రతాపరమైన ఆందోళనలు లేనప్పుడు... మొబైల్ సేవలపై నియంత్రణ అవసరం లేదని తెలిపింది. మొబైల్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచాలని ఆదేశించినపుడు వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అనుమతించవచ్చని, విమానాల్లో సేవలకు వార్షిక లైసెన్స్ రుసుముగా ప్రారంభంలో రూపాయి మాత్రమే ఉండాలని ట్రాయ్ నిర్దేశించింది.

More Telugu News