Niveda Thomas: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మరో చిత్రానికి ఓకే చెప్పిన నివేదా థామస్
  • ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే అంటున్న పెదనాన్న!
  • డబ్బింగ్ మొదలెట్టిన సుధీర్ బాబు 
  • వాయిదా పడనున్న నాని 'అ!'

*  యంగ్ హీరో నాగశౌర్య సరసన నివేదా థామస్ కథానాయికగా నటించనుంది. గీతాంజలి, సుప్రీం వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన సాయి శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నాగశౌర్య, నివేదా జంటగా నటిస్తారు.
*  ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలోనే జరుగుతుందని ఆయన పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ప్రకటించారు. పెళ్లి చేసుకోవడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది అయిపోతుందని ఆయన చెప్పారు.  
*  సుధీర్ బాబు తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ముగిసింది. దీంతో నిన్నటి నుంచి డబ్బింగ్ ప్రారంభించారు. నూతన దర్శకుడు రాజశేఖర్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ నాభ నటేష్ కథానాయికగా నటించింది.
*  నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న తొలి చిత్రం 'అ!' విడుదల వాయిదా పడేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు, కానీ, మరో రెండు వారాలు వాయిదా పడచ్చని తెలుస్తోంది.  

More Telugu News