video viral: వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తల్లీకొడుకులు.. వీడియో వైరల్

  • కుమారుడితో క‌లిసి రోడ్డు ప‌క్క నుంచి న‌డుచుకుంటూ వెళుతోన్న మహిళ
  • అదే సమయంలో కూలిన భారీ చెట్టు
  • నెద‌ర్లాండ్‌లోని హోర్స్ట్ లో ఘటన

ఓ తల్లీకొడుకులు వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న ఘ‌ట‌న నెద‌ర్లాండ్‌లోని హోర్స్ట్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి. నిన్న సాయంత్రం ఓ మ‌హిళ త‌న కుమారుడితో క‌లిసి రోడ్డు ప‌క్క నుంచి న‌డుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో ఓ భారీ వృక్షం కూలి ఆ తల్లీకొడుకుల పక్కనే పడింది. ఆ సమయంలో చెట్టు తాకడంతో కొన్ని హోర్డింగులు కూడా పడ్డాయి. ఆ తల్లీకొడుకులు మరో అడుగు ముందుకు వేస్తే ప్రాణాపాయంలో పడేవారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి....  

More Telugu News