stock markets: ఇవాళ కూడా రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు

  • గ‌త మూడు రోజులుగా జోరు మీదున్న సెన్సెక్స్‌
  • 10,900 మార్కు దాటిన నిఫ్టీ
  • 35,511 వ‌ద్ద ముగిసిన సెన్సెక్స్‌

గ‌త మూడు రోజులుగా లాభాల్లో కొన‌సాగుతున్న దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా అదే జోరును కొన‌సాగించాయి. ట్రేడింగ్ ఆల్ టైమ్ రికార్డుల‌ను సృష్టించాయి. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ ఉదయం నుంచే దేశీయ సూచీలు లాభాల్లో న‌డిచాయి. అదే లాభాల బాట‌ను కొన‌సాగిస్తూ మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 251 పాయింట్లు లాభపడి 35,511 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని చేరుకుంది. నిఫ్టీ కూడా 78 పాయింట్ల లాభంతో 10,895 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.75గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అదానీపోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడగా.. అంబుజా సిమెంట్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

More Telugu News