app: యాప్ డౌన్‌లోడ్ల‌లో అగ్ర‌రాజ్యాన్ని దాటేసిన భార‌త్‌

  • మొద‌టి స్థానంలో చైనా
  • రెండు, మూడు స్థానాల్లో భార‌త్, అమెరికా
  • నివేదిక విడుద‌ల చేసిన‌ యాప్ ఆనీ సంస్థ‌

టెలికాం రంగంలోకి జియో వ‌చ్చిన త‌ర్వాత ఇంట‌ర్నెట్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో యాప్ డౌన్‌లోడ్లు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. ఎంతెలా అంటే... అగ్ర‌రాజ్యం అమెరికాను కూడా భార‌తదేశం దాటే స్థాయికి ఎదిగింది. అవును... ఇటీవ‌ల యాప్ ఆనీ అనే కంపెనీ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం ఎక్కువ‌గా మొబైల్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న దేశాల్లో భార‌త్ రెండోస్థానంలో నిలిచింది. అగ్ర‌రాజ్యం అమెరికా మూడో స్థానంలో ఉంది.

ఇక మొద‌టి స్థానంలో చైనా ఉంది. 2017లో మన దేశంలో యాప్‌ల వినియోగం 215 శాతం పెరిగింది. సగటున భారతీయులు నెలకు 40 కంటే ఎక్కువగా యాప్‌లను వినియోగిస్తున్నారని నివేదిక వెల్ల‌డించింది. కానీ, అమెరికాలో మాత్రం 2016తో పోల్చుకుంటే గతేడాది యాప్‌లను వినియోగించేవారి సంఖ్య 5శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. ఎక్కువగా ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్‌ తొలిస్థానంలో ఉండ‌గా, ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ట్రూకాలర్‌, షేర్‌ఇట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, యూసీ బ్రౌజర్‌, అమేజాన్‌, పేటీఎం, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి.

More Telugu News