ntr: ఈరోజుకీ ఎన్టీఆర్ కి ‘భారతరత్న’ రాలేదు.. ఇక రాదేమో కూడా!: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చలామణి అవుతున్నారు
  • ఆయన ఆశయాలను నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదు
  • ఎన్టీఆర్ ఎంతో చేశారు : తమ్మారెడ్డి 

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు చివరిసారిగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ గురించి ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు. ‘నా ఆలోచన’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ చివరిసారిగా చేసిన ఇంటర్వ్యూ ‘ధర్మపీఠం’. ఆ రోజుల్లో ఓ టీవీ ఛానెల్ లో ఈ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు నేను అక్కడే ఉన్నా. ఇప్పటికీ, ఆ వీడియో చూస్తే..జనాల్లో నేను కూర్చుని ఉంటాను. ఆయన (ఎన్టీఆర్) ఆరోజు ఆవేదన పడ్డారు.

 ఆ తర్వాత ఓ వారం రోజులో లేదా పదిరోజులో బ్రతికి ఉన్నట్టున్నారు! విచిత్రమేంటంటే.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన్ని కాదన్నవాళ్లు, ఆయన పోయిన తర్వాత ఆయన బొమ్మ పెట్టుకుని, ఆయన పేరుతోనే చలామణి అవుతున్న చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఎన్టీఆర్ పేరుతో చలామణి అవడం తప్పని నేను అనను. కానీ, ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టేందుకు ప్రయత్నం చేయడం లేదని గట్టిగా చెబుతున్నాను. సామాన్యులు, కర్షకులు, కార్మికులు, మహిళల కోసం ఎన్టీఆర్ ఎంతో ఆలోచించారు..ఎంతో చేశారు. కానీ, ఈరోజుకీ ఎన్టీఆర్ కి ‘భారతరత్న’ రాలేదు.. ఇక రాదేమో కూడా!’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News