Collectors Conference: కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ... విరుచుకుపడుతున్న ఏపీ ఉన్నతాధికారులు!

  • కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరం
  • ఇంకా బురద జల్లడమేంటన్న సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • హైదరాబాద్ ను చూసి మాట్లాడాలన్న ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య

నిన్న హైదరాబాద్ లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఉదయం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్న సంగతి తెలిసిందే.

ఆపై ఉన్నతాధికారులు, కలెక్టర్ల ప్రసంగాలు ప్రారంభం కాగా, ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను ప్రస్తావిస్తూ, ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఆయన ఇంకా బురద జల్లుతున్నారని ఆరోపించారు.

 హైదరాబాద్ ను ఏపీ పాలకులు నిర్లక్ష్యం చేశారన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఇరవై సంవత్సరాలకు ముందు, ఆ తరువాత హైదరాబాద్ ఎలా ఉందో ఓసారి పరిశీలించి, ఆపై మాట్లాడాలని సూచించారు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయిన తరువాత కూడా ఈ తరహా విమర్శలు ఏంటని కలెక్టర్లు ప్రశ్నించారు.

More Telugu News