sai dharam tej: 'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ పాత ఫొటోను పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్

  • వరుణ్ బర్త్ డే నేడు
  • శుభాకాంక్షలు తెలిపిన సాయి ధరమ్
  • పాత ఫొటోను అభిమానులతో పంచుకున్న ధరమ్

'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ పాత ఫొటోను పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుణ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. 'విష్ యూ హ్యాపీ బర్త్ డే రా వరుణ్. లవ్ యూ. ఈ ఏడాది మొత్తం నీకు సక్సెస్ ఫుల్ గా ఉండాలి' అంటూ ట్విట్టర్లో విషెస్ చెప్పాడు. దీంతో, పాటు గతంలో ఇద్దరూ దిగిన ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఆ ఫొటోలో వరుణ్ బొద్దుగా ఉన్నాడు. ఈ ఫొటోపై 'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

More Telugu News