mexico: వెలుగులోకి వచ్చిన మహా అద్భుత గుహలు!

  • అతిపెద్ద గుహలను కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్తలు
  • ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవిగా గుర్తింపు
  • తాజా గుహల్లో వేల ఏళ్లనాటి శిలాజాలు లభ్యం

పురాతత్వ శాస్త్రవేత్తల ఏళ్ల పరిశోధన సఫలీకృతం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన గుహలను వారు కనుగొన్నారు. ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవిగా (83 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి) గుర్తింపు పొందాయి. తాజాగా పురాతత్వ శాస్త్రవేత్తలు అతిపెద్ద గుహను మెక్సికోలో కనుగొన్నారు. యుకటన్ ద్వీపకల్పంలో ఈ అంశంపై రాబర్ట్ స్కిమిట్నర్ గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. చివరకు పురాతత్వ పరిశోధన సంస్థ 'గామ్' బృందం నీటి అడుగున ఉన్న ఈ పురాతన గుహలను వెలుగులోకి తెచ్చింది. స్కూబా డైవర్లను లోపలకు పంపి గుహలను కనుగొంది.

ఈ పురాతన గుహలు 347 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ గుహలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ గుహల్లో వేల ఏళ్లనాటి శిలాజాలు లభించాయి. వీటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. మాయన్ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ గుహలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గుహలు 1500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండవచ్చని మరో శాస్త్రవేత్త అంచనా వేస్తున్నారు.  

More Telugu News