Kukatpalli: యువతికి అసభ్య సందేశాలు.. హైదరాబాద్ లో జర్మన్ పౌరుడిపై నిర్భయ కేసు!

  • పరిచయమైన యువతికి అసభ్య సందేశాలు
  • వాట్స్ యాప్ ద్వారా పంపించిన జర్మనీ వ్యక్తి
  • అరెస్ట్ గురించి తెలుసుకుని ముందే లొంగుబాటు

జర్మనీ నుంచి హైదరాబాద్ కు వచ్చి బీడీ అగ్రికల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న టోర్ స్టర్ రీనర్ న్యూమన్ (52) అనే జర్మనీ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ లో నివాసం ఉన్న ఓ యువతి (31)కి న్యూమన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అలుసుగా తీసుకున్న న్యూమన్, ఆమెకు వాట్స్ యాప్ ద్వారా అసభ్యకర సందేశాలను పంపించడం మొదలుపెట్టాడు.

మెసేజ్ లు శ్రుతిమించుతుండటంతో, బాధితురాలు గత నెలలో పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు, మెసేజ్ లు న్యూమన్ నుంచే వస్తున్నట్టు తేల్చారు. అతనిపై నిర్భయ సెక్షన్ కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఇక నిందితుడు కూకట్ పల్లి దగ్గరలో ఉన్న లోధా టవర్స్ లో నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, ఆ విషయాన్ని అప్పటికే తెలుసుకున్న ఆయన, కోర్టులో లొంగిపోయి, బెయిల్ తీసుకున్నాడట. కేసును విచారిస్తున్నట్టు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.

More Telugu News